అందరికీ నమస్కారము,కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్ లొ విహరిస్తూ ఉండగా తెలుగు బ్లాగులు చూసిన నాకు బ్లాగాలనిపించింది. కాని నా ట్రేడ్ మార్క్ అయిన బద్దకం వదిలి బ్లాగటానికి కుదరలేదు. నాకు తెలుగు సాహిత్యంపై పట్టు లేదు. కానీ తెలుగంటే ఎంతో ఇష్టం. అందుకే ఏదో ఒకటి వ్రాయాలని మొదలు పెట్టాను.
నా సుత్తితొ మీ మెదడు ఈపాటికి వేడెక్కి వుంటుంది కదా, అందుకే ఈరొజు ఇంతటితో వదిలి వేస్తున్నాను. బ్లాగు జీవితంలొ చిన్ని చిన్ని అడుగులు వేస్తున్న నాకు మీ సలహాలు, సూచనలు, ఆశీస్సులు అంద చేస్తారని ఆశిస్తూ ఒక చిన్న జోకు. ఒక మిత్రుడు చెప్పిన జోకు ఇది. మీ చప్పట్లన్నీ అతనికే చెందుతాయి.
కోర్టులొ రావణుడు బోనులో వున్నాడు.
కోర్టు గుమస్తా రావణుడితొ: గీత మీద చెయ్యి వేసి అంతా నిజమే చెపుతాను అని ప్రమాణం చెయ్యి.
రావణుడు: సీత మీద ఒక్కసారి చెయ్యి వెసినందుకే నా ప్రాణం పోయింది. గీత మీద చెయ్యి వెయ్యనంటే వెయ్యను.
మీ,
బ్లాగురాముడు (చందు).
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
సుస్వాగతం!
శుభారంభం
బ్లాగు రాముడికి స్వాగతం.
అలనాటి రాముడులా అరణ్య వాసం లేకుండానే మీ "బ్లాగుయోధ్య" ను బ్లాగు రంజకంగా బ్లాగించండి.
బ్లాగుల బాగు విహారి.
స్వాగతం!
నవ్వుల పువ్వులతో శుభారంభం చేశారు.స్వాగతం!
అన్నట్టు జోకు అదిరింది:-)
సుస్వాగతం.రాముడిలా ఒకే మాట ఒకేబాణం అనుకుంటూ కూర్చోవద్దు..బొలెడు మాటలు ,చాంతాడు పోస్టులతో అలరించండి.
అందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సహమే నాకు కొండంత బలం.
రాధిక గారు, విహారి గారు మరియూ డా:ఇస్మాయిల్ గారు,
నిజం చెప్పాలంటే నాకు వెంటనే బ్లాగు రాయాలన్న కోరిక కలిగింది మీ బ్లాగులు చదివిన తరువాతే. అందుకు మీకు మరొక్క సారి ధన్యవాదాలు.
Post a Comment