చాలా సంవత్సరాల కిందట జరిగిన సంగతి. నేను అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల గురించి వాకబు చెయ్యటానికి కొయంబత్తూరులో మా అన్నయ్య దగ్గర ఒక నెల రోజుల పాటు ఉన్నాను. మా అన్నయ్య అప్పుడు యం.బి.ఏ. చదువుతున్నారు. నేను రోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నయ్య ఉన్నా లేకున్నా వాళ్ళ మెస్ కి వెల్లి భోజనం చేసి వచ్చే వాడిని.
ఒక రోజు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అక్క పెళ్ళికి మమ్మల్ని అహ్వానించారు. పెళ్ళికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాము. ముందు స్వీట్స్ పెట్టారు తరువాత ఇడ్లీ, పరాటాలు పెట్టారు. కొంచంసేపటి తరువాత అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ మాకు ఇడ్లీ, పరాటా వడ్డించమన్నారు. అందరూ మళ్ళీ పెట్టించుకుని తింటుంటే నేను పెద్ద పిస్తా లాగ ఎందుకురా బాబు అంత కక్కుర్తి పడతారు, తరువాత అన్నం వడ్డిస్తారుగా అని మనసులో అనుకుని కూర్చున్నాను. ఐదు నిమిషాల తరువాత అందరూ లేచి చేతులు కడుక్కోవటానికి బయలుదేరారు. నాకు ఒక్కసారిగా ఫ్యూసు ఎగిరింది. కాని ఏమి చేస్తాను, నేనూ వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చాను.
ఇంటికి వెళ్ళేటప్పుడు మా అన్నయ్యని హొటల్ దగ్గర ఆపమని చెప్పి అప్పుడు చెప్పాను నాకు ఆకలి వేస్తుందని. తరువాత తెలిసింది ఎమిటంటే తమిళనాడులో చాలావరకు సాయంత్రం టిఫిన్ చేస్తారని, మా మెస్ లో మాత్రం భోజనం వుంటుందని. అప్పటినుంచి ఎక్కడైనా ఎవరైనా మళ్ళీ వడ్డిస్తే ఆకలిగా ఉంటే మాత్రం వద్దు అని చెప్పను.
బ్లాగులు చదువుతూ వుంటే పాత విషయాలు గుర్తు వచ్చి, వెంటనే రాసాను.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
హ హ...భలె జరిగింది.మొహమాటానికి పోయి కడుపు మాడ్చుకున్న రోజులు చాలానే వున్నాయండి నాకు.
Post a Comment